Thursday, April 10, 2008

అమ్మ దేవీపురం

అది విశాఖ జిల్లా. సింహాచలం నుండి యలమంచిలి వెళ్ళే దారిలో ఒకచిన్న దేవాలయం (ప్రస్తుతం). దానిపేరే దేవీపురం. అందులో కొలువున్న దేవత అమ్మ.

DSC00252ఆ దేవాలయం గత మూడేళ్ళ నుండి అభివ్రుద్ది చెందుతోంది. ఇప్పటికి చాలా మందికి అచ్చట గుడి ఉన్నది అని తెలియదు. దాని ప్రాముఖ్యత ఏమిటంటె, ఆ గుడి శ్రీచక్రమును పోలి ఉంటుంది.DSC00253

దేవీ ఖడ్గమాల స్తోత్రమాలలొ ఎన్ని నామాలపేర్లు ఉన్నాయో అన్ని నామాల దేవతామూర్తులు, ఆనామానికి తగ్గట్టుగా, ఆనామాన్ని వర్నిస్తున్నట్టుగా ఆ దేవతలు కనిపిస్తారు. అయితే మనం గుర్తించవలసిన  ముఖ్య విషయం  ఆ దేవతలు  పూర్తిగా నగ్నరూపంలో కనిపించడమే. అయితే ఇక్కడ మనం తెలుసుకొనవలసినది  ఏమిటంటే "అమ్మని బొమ్మలా కాకుండా అమ్మలాచూడడం". అక్కడ ప్రధాన దేవతామూర్తి గూడా పరమేశ్వరునితో గూడి నగ్నంగా ఉండడమే.

  DSC00256

                                ఇది గ్రహించ గలగాలంటే ఎంతో పూర్వజన్మ సుక్రుతం ఉండాలి. పూర్వము మనపెద్దలు"ఎక్కడ స్త్రీలు గౌరవింప బడుదురో, అక్కడ దేవతలు కొలుఉందురు"అని అన్నారు. కానీ ఈ రోజుల్లో ఈ విషయం ఎతమందికి తెలుసు. మన సభ్య సమాజంలోని ఎక్కువమంది పురుషులు తెలిసో తెలియకో ఆడవారిని బాధ పెడుతున్నారు. అ లాగని  "ఆడవారి వల్ల బాధపడే మగవారు లేరు" అని నేను అనను. కాకపోతే తక్కువ శాతం.ఇక్కడ దేవాలయ విశేషమేమిటంటే మనం మొదట్లో ప్రదక్శిణం ఎక్కడైతే మొదలు పెడతామో  అది పూర్తయ్యె సరికి మనం ఆగుడి చుట్టూ  శ్రీచక్రాకారంలో ఆగుడినిచుట్టి వస్తాము.అంటే మనం ఒకసారి చూసివచ్చే సరికి గుడికి మనం మూడుసార్లు ప్రదక్శిణములు చేసినట్టు. చూశారా శిల్పి ఎంతగొప్పగా ఆదేవాలయాన్ని రూపకల్పన చేశాడో

ఆ దేవాలయాన్ని ఆ విధంగా రూపొందిచమని సాక్శాత్తూ ఆ అమ్మే ఒక భక్తునికి కలలో కనిపించి ఆజ్న చేసింది. ఆ మహానుభావుడు ఎంత అద్రుష్టవంతుడో. DSC00254ఆమహనీయుడు తన భార్యతో కలసి అక్కడే నివాసముంటున్నారు.

ఇంతేకాదు  ఆ ఆలయంలో యాగసాలకూడా ఉంది. అచ్చట పూజారులు మనలను కూచోబెట్టి ఎంత చక్కగా పూజ చేయిస్తారో, అది చేసినవారికే ఆ ఆనందం తెలుస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ (ప్రత్యేకించి మగవారు) ఒక్కసారైనా ఆ ఆలయాన్ని చూడాలని నా కోరిక.

ఇంకా ఈగుడి గురించి తెలుసుకొనవలసింది చాలాఉంది. కానీ నాకు తెలిసినదింతే.DSC00255

Wednesday, April 9, 2008

మహిళ

మహిళ అనగానే ముందు గుర్తుకొచ్చెది అమ్మ.

మహిళ ముందుగా పాపాయి రూపంలొ కనిపిస్తుంది. పాపాయిగా, కన్న తల్లి దండ్రులను మురిపిస్తుంది. ఆ మురిపాలతొ పెరిగి  తోడబుట్టీన వారికి ప్రేమని  పంచుతుంది.  అలా పెరిగి పెద్దదయిన ఆ చిన్నారి, పెద్దలు తెచ్చిన ఒక అయ్యకి భార్యగా ఎదుగుతుంది. ఇంతటితో ఆగుతుందా అంటే.. ఆగదు సరికదా.. ఆ ఎదుగుదలలొ ఎంతొ అందం ఆనందం ఊహిస్తుంది.

సరదాగా భర్తతొ సహజీవనం సాగిస్తూ మరొక జీవికి ప్రాణం ఇస్తుంది. ఆ బిడ్డను ఈ లోకంలోకి తీసుకు రావడానికిఆమహిళఎన్నిఅనుభవాలు చవిచూస్తుందొ, ఎంత బాధ అనుభవిస్తుందొ, ఎంత ఆశపడుతుందొ... కాని, ఆ బిడ్డను చుశాక ఆ అవస్తంతా మర్చిపొతుంది.

తీరా అ బిడ్డని పెంచి పెద్దచేసి, విద్యా బుద్దులు చెప్పించి, పెళ్ళీ ఛెస్తుంది. అప్పుడు ఆ మహిళ అప్పటికి తనపని అయింది అనుకుంటుంది. కానీ...... 

అప్పుడే అసలు కధ వడ్డి (అంటే మనుమలు మనుమరాండృ) మొదలవుతుంది

అన్న మాట. వారిని చూసుకొని మురిసిపోయి మనసు ఆనందపడి  ఆడజన్మకు

సాఫల్యత పొందాను అని అనుకొంటుంది.  ఆవిడే పరిపూర్ణ  మహిళ