మహిళ అనగానే ముందు గుర్తుకొచ్చెది అమ్మ.
మహిళ ముందుగా పాపాయి రూపంలొ కనిపిస్తుంది. పాపాయిగా, కన్న తల్లి దండ్రులను మురిపిస్తుంది. ఆ మురిపాలతొ పెరిగి తోడబుట్టీన వారికి ప్రేమని పంచుతుంది. అలా పెరిగి పెద్దదయిన ఆ చిన్నారి, పెద్దలు తెచ్చిన ఒక అయ్యకి భార్యగా ఎదుగుతుంది. ఇంతటితో ఆగుతుందా అంటే.. ఆగదు సరికదా.. ఆ ఎదుగుదలలొ ఎంతొ అందం ఆనందం ఊహిస్తుంది.
సరదాగా భర్తతొ సహజీవనం సాగిస్తూ మరొక జీవికి ప్రాణం ఇస్తుంది. ఆ బిడ్డను ఈ లోకంలోకి తీసుకు రావడానికిఆమహిళఎన్నిఅనుభవాలు చవిచూస్తుందొ, ఎంత బాధ అనుభవిస్తుందొ, ఎంత ఆశపడుతుందొ... కాని, ఆ బిడ్డను చుశాక ఆ అవస్తంతా మర్చిపొతుంది.
తీరా అ బిడ్డని పెంచి పెద్దచేసి, విద్యా బుద్దులు చెప్పించి, పెళ్ళీ ఛెస్తుంది. అప్పుడు ఆ మహిళ అప్పటికి తనపని అయింది అనుకుంటుంది. కానీ......
అప్పుడే అసలు కధ వడ్డి (అంటే మనుమలు మనుమరాండృ) మొదలవుతుంది
అన్న మాట. వారిని చూసుకొని మురిసిపోయి మనసు ఆనందపడి ఆడజన్మకు
సాఫల్యత పొందాను అని అనుకొంటుంది. ఆవిడే పరిపూర్ణ మహిళ
1 comment:
మాణిక్యాంబ గారు,బ్లాగు ప్రపంచానికి సాదరస్వాగతం.మీ మొదతి బ్లాగు టపాతోనే తల్లి గురించి రాసి అందర్నీ ఉత్తేజితులను చేసారు.ధన్యవాదాలు.ఇక మీ అబ్బాయి మీ వంతల గురించి చెప్పి మమ్ముల్ని తెగుఊరించేస్తున్నారు.మీ చెతివంట ఎప్పటికి తినగలమో!!??
Post a Comment